మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్ తన పదవికి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. గతంలో బిఆర్ఎస్ కౌన్సిలర్లు చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలంటూ కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత మురళి యాదవ్ మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు.
వాయిస్ ఓవర్
ఈ సందర్భంగా మురళి యాదవ్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన నర్సాపూర్ మున్సిపాలిటీకి గత ప్రభుత్వం ఎలాంటి నిధులు మంజూరు చేయలేదని విమర్శించారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ నర్సాపూర్ వచ్చినప్పుడు మంజూరు చేసిన నిధులు ఇప్పటికీ రాలేదని చెప్పారు. అవిశ్వాస తీర్మానానికి ముందే స్వచ్చందంగా రాజీనామా చేసినట్టు తెలిపారు.























Discussion about this post