ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులకు బీజేపీలో స్థానం లేదని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…పాలమూరు ఎంపీ సీటు విషయంలో తనను పిలిచి కూడా మాట్లాడలేదని, జాతీయ నాయకత్వం దేశం కోసం పోరాడుతున్నారని అన్నారు. ఆయన కుమారుడు మిథున్ రెడ్డి మాట్లాడుతూ… గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపి పార్టీకి అభ్యర్థి లేనప్పుడు తాను పోటీ చేశానని, మా నాన్నకు ఎంపీ టికెట్ రాకుండా పార్టీ కోసం పని చేసిన మమ్మల్ని మోసం చేశారని చెప్పారు.
Discussion about this post