ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు… పాట 95 ఏళ్ల అకాడమీ అవార్డుల చరిత్రలో మన దేశానికి ఆస్కార్ తీసుకు వచ్చిన తొలి భారతీయ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పుడు మరోసారి నాటు నాటు… పాట ఆస్కార్ స్టేజి మీద సందడి చేసింది.
ఆస్కార్స్ 2024లో బార్బీ సినిమాలోని వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్ పాటకు ఆస్కార్ వచ్చింది. బిల్లీ ఐలిష్, ఫిన్నియస్ ఓ కానల్… ఈ అవార్డును అందుకున్నారు. విజేతలుగా ఆ ఇద్దరి పేర్లు అనౌన్స్ చేయడానికి ఇద్దరు అందాల భామలు వేదికపైకి వస్తున్న సమయంలో వెనుక నాటు నాటు… సాంగ్ విజువల్స్ ప్లే చేశారు. పాటలో ఎన్టీఆర్, రామ్ చరణ్ వేసిన హుక్ స్టెప్ కనిపించింది. ఆస్కార్ విజేతలను ప్రకటించే ముందు నామినేషన్స్ పొందిన వాళ్ళ వివరాలతో కూడిన వీడియో ప్లే చేస్తారు. ఆ తర్వాత గత ఏడాది ఆ అవార్డు అందుకున్నది ఎవరో కూడా చూపిస్తారు. ఆస్కార్స్ 2023లో నాటు నాటు.. పాట విజేతగా నిలిచింది. అందుకు ఆ సాంగ్ విజువల్స్ చూపించారు.
Discussion about this post