తప్పుడు కుల ధ్రువీకరణ కేసులో ప్రముఖ నటి, మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ కు ఊరట లభించింది. ఆమె కుల ధృవీకరణ పత్రం చెల్లుబాటు అయ్యేలా స్క్రూటినీ కమిటీ ఉత్తర్వులను భారత అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. ఈ మేరకు హైకోర్టు ఆదేశాలను రద్దు చేయాలని ధర్మాసనం ప్రకటించింది. తన కుల ధృవీకరణ పత్రాన్ని రద్దు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును నవనీత్ కౌర్ సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై 2024 ఫిబ్రవరి 29న సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. శివసేన మాజీ ఎంపీ ఆనంద విఠోబా నవనీత్ కౌర్ కుల ధ్రువీకరణపై హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు నవనీత్ కౌర్ రాణా కుల ధృవీకరణ పత్రాన్ని రద్దు చేసింది. ఆమె మోసపూరితంగా డాక్యుమెంట్ ను పొందారని … ఎంపీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని..ఆదేశిస్తూ .. రూ. 2 లక్షలు జరిమానా విధించింది.తాజా తీర్పుతో హై కోర్ట్ ఆదేశాలు రద్దు అయ్యాయి.
Discussion about this post