నాగర్ కర్నూల్ జిల్లాలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ నిర్లక్ష్యంతో బాలింత మృతిచెందిందని బాధిత కుటుంబం ఆరోపిస్తుంది. హౌసింగ్ బోర్డ్‌లో నివాసముంటున్న కావ్య తనకు పురిటి నొప్పులు రావడంతో ప్రియాంక హాస్పిటల్లో చేరింది. డాక్టర్లు డెలవరి చేసి మగబిడ్డ పుట్టిందని తెలిపారు. కావ్య పరిస్థితి సీరియస్‌గా ఉందని చెప్పారు. దీంతో హైదరాబాదులోని ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. మృతురాలి బంధువులు ప్రియాంక ఆసుపత్రి నిర్లక్ష్యంతోనే మృతిచెందిందని ఆరోపిస్తున్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరగడంతో పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Discussion about this post