విశేషంగా పుష్పాలంకరణ
నెల్లూరు జిల్లా అల్లూరు పోలేరమ్మ జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా చేసిన పుష్పాలంకరణ విశేషంగా నిలిచింది. ఏటా ధనుర్మాసంలో పోలేరమ్మ తిరునాళ్లు నిర్వహించటం ఏడు శతాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోంది. పోలేరమ్మ బలికోరే దేవత కాదు పొలిమేరలో ఉండి రక్షణనిచ్చే దేవతగా ఆది శంకరాచార్యుల వారు చెప్పారంటారు. ఇక్కడి ఆలయంలో బ్రాహ్మణ పురోహితులు నిత్య పూజలు, నివేదన నిర్వహించటం విశేషం.
Discussion about this post