విద్యార్ధుల్లో క్రీడా నైపుణ్యాలను తీర్చిదిద్దాల్సిన వ్యాయామ గురువు…సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించాడు. ఏపీ మోడల్ స్కూల్ అంతర్జాతీయ క్రీడావేదిక సాక్షిగా విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికల తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు డీఈఓ రామారావు జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టారు. వ్యాయామ ఉపాధ్యాయుని అనుచిత ప్రవర్తన వాస్తవమని తేలడంతో విధుల నుంచి తొలగించి, పోలీసులకు అప్పగించారు. ప్రాథమిక విచారణ అనంతరం…పోలీసులు ఫోక్సో సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.
Discussion about this post