విలక్షణ రాజకీయాలకు ఆస్కారం ఉన్న నెల్లూరు జిల్లాలో పొలిటికల్ వార్ మొదలైంది. గత ఎన్నికల్లో వైసీపీకి ఏకపక్షంగా అధికారం అప్పగించిన నెల్లూరు జిల్లాలో ఇప్పుడు రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రస్తుతం వైసీపీలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక్కసారిగా తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ప్రతిపక్షాల పంచన చేరి ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి సలహాదారు వ్యవస్థతో విసిగిపోయానని, ఎమ్మెల్యేగా గుర్తింపు, గౌరవం లేకపోవడంతో ప్రతిపక్షంలో చేరుతున్నానని ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ అంటున్నారు. దీనిపై మన నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ ఉదయగిరి టీడీపీ సీనియర్ నాయకులు కంభం విజయ రామారెడ్డిని ఇంటర్వ్యూ చేశారు.
Discussion about this post