ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ కొత్తకొత్త వ్యూహాలు అనుసరిస్తోంది .కొత్త కొత్త యాప్ లు , వెబ్ సైట్లు రూపొందించి ప్రజలను చైతన్య పరుస్తోంది . లోక్సభ ఎన్నికల్లో అసత్య సమాచార వ్యాప్తిని అరికట్టి, ప్రజలకు కచ్చితమైన సమాచారం అందించేందుకు ఎన్నికల కమిషన్ (ఈసీ) కొత్త వెబ్సైట్ను తీసుకువచ్చింది. మిథ్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్ పేరుతో రూపొందించిన ఈ వెబ్సైట్ను మంగళవారం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేశ్వర్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు ప్రారంభించారు. ప్రజలు ఎప్పటికప్పుడు అడిగే ప్రశ్నలను, వెలుగులోకి వచ్చిన నకిలీ సమాచారాన్ని ఈ రిజిస్టరు ద్వారా అప్డేట్ చేస్తూ ఓటర్లకు తెలియజేస్తామని ఎన్నికల కమిషన్ చెప్పింది.
Discussion about this post