నిజామాబాద్ జిల్లా : నిజామాబాద్ జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. గులాబీ నేతలు ఒకరి తర్వాత ఒకరు పార్టీని వీడుతున్నారు. నిజామాబాద్ అర్బన్, బోధన్, ఆర్మూర్ నుంచి పలువురు ముఖ్య నేతలు హస్తం పార్టీలో చేరారు. మరికొందరు బీజేపీలోకి వెళ్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నేతలు బీఆర్ఎస్ ను వీడటంపై పార్టీ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. ఇంత జరుగుతున్నా బీఆర్‌ఎస్ పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు. మరోవైపు బీఆర్‌ఎస్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా కూడా కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో ఆయన పార్టీ మారతారనే ప్రచారం సాగుతోంది. నిజామాబాద్ జిల్లాలో మారుతున్న రాజకీయ పరిణామాలు.
Discussion about this post