ఖమ్మం తాజా వార్తలు : కూసుమంచి మండలానికి చెందిన చేగొమ్మ సొసైటీ చైర్మన్, ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టర్ ఇంటూరి శేఖర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని జిల్లా సహకార శాఖ అధికారి మురళీధర్ రావుకు మెజారిటీ డైరెక్టర్లు లేఖ అందజేశారు. సొసైటీలో మొత్తం 13 మంది డైరెక్టర్లు ఉండగా, 10 మంది అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు. చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని జిల్లా సహకార అధికారి మురళీధరరావు తెలిపారు.
Discussion about this post