అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప్రొఫెసర్ రాజేష్ నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ టిక్కెట్టు కోసం ప్రయత్నం చేసిన ప్రొఫెసర్ రాజేష్ కి పార్టీ మొండి చేయి చూపడంతో ఆయన వర్గీయులతో కలిసి రాప్తాడు ఎమ్మార్వో కార్యాలయంలో నామినేషన్ వేశారు. రాప్తాడు నియోజకవర్గంలో బీసీలకు ఎమ్మెల్యే గా ఇప్పటివరకు అవకాశం ఇవ్వలేదని అందువల్ల ఈ ప్రాంతంలోని బీసీ, ఎస్టీ మైనారిటీలకు న్యాయం జరగలేదన్నారు.
Discussion about this post