మాస్క్ లేకుండా ప్రవేశం లేదు.
నాంపల్లిలో నుమాయిష్ ఎగ్జిబిషన్ సందడి : జనవరి 1న హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నుమాయిష్ ప్రారంభమైంది. ఈ ఎగ్జిబిషన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఇది 83వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్. ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 15 వరకు ప్రతిరోజూ తెరిచి ఉంటుంది. గతేడాది నుమాయిష్ ప్రవేశ రుసుము పెద్దలకు రూ.40. ఈ ఏడాది కూడా అదే ధరను నిర్ణయించింది. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ఏడాది జనవరి 9న మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఆ రోజు మహిళలకు నుమాయిష్‌లోకి ప్రవేశం ఉచితం. అలాగే జనవరి 31న బాలల దినోత్సవం పేరుతో నుమాయిష్ పిల్లలకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తోంది. ఈ రెండు రోజుల్లో పెద్ద సంఖ్యలో జనం వచ్చే అవకాశం ఉంది. కరోనా వ్యాప్తి చెందుతున్నందున తప్పనిసరిగా మాస్క్ ధరించాలి.
Discussion about this post