సస్పెన్షన్ ఎత్తివేతకు లంచం తీసుకుంటూ దొరికిపోయాడు ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. భీమవరం హెడ్ పోస్టాఫీస్ లో ఈ ఘటన జరిగింది. గతేడాది డిసెంబర్ లో అదే పోస్టాఫీస్ లో పనిచేసే సీనియర్ సూపరింటెండెంట్ పి. బాల సుబ్రమణ్యం లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు దొరికి పోయాడు. ఓ పోస్టుమేన్ పై సస్పెన్షన్ ఎత్తివేతకు ఆయన ఈ లంచం తీసుకున్నట్లు తెలిసింది. ఆయన సస్పెన్షన్ తర్వాత హెడ్ పోస్ట్ మాస్టర్ కెవిఎస్ఆర్ ఆచార్యు లు పోస్టాఫీస్ సుందరీకీకరణ పేరిట పలువురు ప్రముఖులు, వ్యాపార సంస్థలు, విద్యాసంస్థల నుంచి రూ. లక్షల్లో విరాళాలు సేకరించినట్లు ప్రచారం జరుగుతోంది.
Discussion about this post