ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కూటమివైపే మొగ్గుచూపుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే కూటమికి అనుకూలంగా ఉండే అవకాశం లేకపోలేదు. ఉత్తరాంద్ర ప్రాంతంలో ఒకటి రెండు చోట్ల తప్ప మిగిలిన నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగానే జరిగింది. గతంలో కంటే ఇప్పుడు పోలింగ్ శాతం పెరగడంతో పాటు, రాజకీయ పరిశీలకుడు ప్రశాంత్ కిషోర్ జోస్యంతో అధికార పార్టీకి కంటిమీద కునుకు లేకుండా పోయింది. మరోవైపు రఘురామ కృష్ణ రాజు జగన్ పైన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఉత్తరాంధ్ర ప్రజలు ఎవరికీ పట్టం కట్టనున్నారు. విశాఖ వేదికగా ఏ పార్టీ నేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Discussion about this post