ప్రతాప సింగరాయ స్వామి : ప్రతాప సింగరాయ స్వామి జాతరకు విశిష్టత ఉంది. ఒక్కరోజే.. మాఘ అమావాస్య రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రమే జాతర కొనసాగుతుంది. సాయంత్రం వేళల్లో స్వామివారికి తలనొప్పి రావడంతో భక్తులకు దర్శనం లేదు. రాత్రి పొద్దుపోయేసరికి అందరూ ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోతారు. ఆలయ పరిసరాల్లో మద్యం, మాంసాహారం సేవిస్తే పాపం కలుగుతుందని భక్తుల నమ్మకం. అందుకే వాగు వెంబడి శాఖాహార వంటకాలు వండుకుని సహపంక్తి భోజనం చేస్తారు.






















Discussion about this post