సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు, భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ…బీజేపీకి ఓటేస్తే దేశం, ధర్మం, డెవలప్మెంట్ వస్తాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కష్టాలు, కులతత్వం, మతతత్వం వస్తాయని చెప్పారు. దేశం సుభిక్షంగా ఉండాలంటే బీజేపీని గెలిపించాలని అన్నారు. దేశంలో మూడోసారి మోడీ ప్రధాని అవుతారని, తుంగతుర్తి అభివృద్ధి మోడీతోనే సాధ్యమని అన్నారు.
Discussion about this post