Pahalgam Terror Attack Debate: టెర్రరిస్ట్‌ల దెబ్బకు ఇండియన్ ఆర్మీని చూసి కూడా భయపడ్డ టూరిస్ట్‌లు…
జమ్మూ అనంత్‌నాగ్ జిల్లా పహల్గాంలోని బైసరన్ లోయలో విహారయాత్రకు వచ్చిన పర్యాటకులే లక్ష్యంగా పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్రకార్యకలాపాలు నిర్వహించే లష్కరే తొయిబా అనుబంధ విభాగం ది రెసిస్టెంట్ ఫ్రంట్ దాడికి పాల్పడింది. ఈ ఈ ఘటనలో 27 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా..
మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇటీవల కాలంలో జమ్మూ కశ్మీర్‌లో జరిగిన అతి పెద్ద ఉగ్రదాడి ఇదేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఈ ఘటనతో కశ్మీర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.
Pahalgam Terror Attack Debate:
జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గాంలో ఉగ్రవాదుల కాల్పుల్లో త్రుటిలో బయటపడిన కొందరు అక్కడ పరిస్థితి చూసి భయంతో వణికిపోయారు. ప్రత్యక్షంగా ముష్కరుల మారణహోమాన్ని చూసిన వారు.. కొండలు, గుట్టల్లో పరిగెత్తుకుంటూ వచ్చి కుప్పకూలిపోయారు.
Watch the Full Debate
Click on the link: https://www.youtube.com/watch?v=4g0Rw5ZQpZg

తమ కళ్లెదుటే బిడ్డలు, భర్తలు, తోబుట్టువులు, బంధువులు,స్నేహితులను కోల్పోయిన బాధతో గుండెలవిసేలా రోదించారు. ఈ క్రమంలో తమను కాపాడటానికి వచ్చిన ఇండియన్ ఆర్మీ జవాన్లను చూసి కూడా భయాందోళనకు గురయ్యారు. వారిని ఉగ్రవాదులు అనుకుని.. మమ్మల్ని చంపొద్దు ప్లీజ్ అంటూ వేడుకున్నారు. గుండెల్ని మెలిపెట్టే ఈ వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Pahalgam Terror Attack Debate
భయంతో వణికిపోతున్న పర్యాటకులకు తాము మిమ్మల్ని కాపాడటానికి వచ్చామని, మీకేమీ కాదని భారత సైనికులు ధైర్యం చెబుతుండటం వీడియోలో వినిపిస్తోంది. బైసరన్ లోయలోకి సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు.. విచక్షణారహితంగా కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. హనీమూన్‌కు వచ్చి.. పెళ్లైన ఐదు రోజులకే నవ వధువు.. తన భర్తను కోల్పోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 28 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మంది గాయపడ్డారు.
For More Updates. Visit Our Website. Click Here.
























Discussion about this post