అనకాపల్లి వికలాంగులకు త్వరలో మంచి రోజులు రానున్నాయని మాజీ మంత్రి అనకాపల్లి జనసేన బిజెపి టిడిపి ఉమ్మడి అభ్యర్థి కొణతాల రామకృష్ణ అన్నారు. సోమవారం రింగ్ రోడ్ జనసేన పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వికలాంగులకు మూడు వేల రూపాయలు పెన్షన్ 6000 రూపాయలకు పెంచుతామని చంద్రబాబు ఇచ్చిన హామీ దివ్యాంగుల జీవితాల్లో వెలుగు నిస్తుందని అన్నారు. ఆర్దిక ఇబ్బందులతో సతమతమవుతున్న వికలాంగులకు చంద్రబాబు నిర్ణయం ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. దివ్యాంగులు అధైర్యపడాల్సిన పని లేదన్నారు.
Discussion about this post