బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాజకీయ బిక్ష పెట్టిన పాలమూరు జిల్లాకు తీవ్ర అన్యాయం చేశారని వంశీచంద్ రెడ్డి విమర్శించారు. కృష్ణాజలాలను ఆంధ్ర పాలకులు దోచుకుపోతుంటే దద్దమ్మలా వ్యవహరించారని అన్నారు. మూడేళ్ళలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారని, తొమ్మిదేళ్లయినా పనులు పూర్తి కాలేదన్నారు. ప్రాజెక్టు పొడవునా నాసిరకం పనులు జరుగుతున్నాయని, కేసీఆర్ దక్షిణ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపించారని విమర్శించారు.
Discussion about this post