తెలంగాణ ద్రోహులకు మాజీ సీఎం కేసీఆర్ ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారని మణుగూరు పార్లమెంట్ బీజేపీ అభ్యర్ధి అజ్మీర సీతారాం నాయక్ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెతున్న సాగుతున్న సమయంలో జగన్ మహబూబాబాద్ రావడానికి సహకరించి, విద్యార్థులపై రాళ్లు రువ్వుడానికి కారణమైన వ్యక్తికి టికెట్ కట్టబెట్టారని మండిపడ్డారు. భద్రాద్రి జిల్లా మణుగూరులో ఏర్పాటు చేసిన పార్లమెంట్ ఎన్నికల సమావేశంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్ పాల్గొన్నారు. ఎంపీగా ఉన్న తనను కాదని, తనకు ఒక మాట అయిన చెప్పకుండా దరవత్ కవితకు ఎంపీ టికెట్ ఇచ్చారని అసహనం వ్యక్తం చేశారు. పార్టీలో ఉండగా ఎన్నిసార్లు కేసీఆర్ ని కలుద్దాం అన్న కలిచే ఛాన్స్ రాలేదని చెప్పారు.
Discussion about this post