రేపటి నుంచి జనసేనాని ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 7న అనకాపల్లి, 8న యలమంచిలిలో సభల్లో పవన్ ప్రసంగించనున్నారు. 9న పిఠాపురంలో ఉగాది వేడుకల్లో పవన్ పాల్గొంటారు. జ్వరంతో వారాహి యాత్రకు పవన్ కల్యాణ్ విరామం ఇచ్చారు. పవన్‌కు జ్వరం తగ్గడంతో మూడురోజుల పర్యటన షెడ్యూల్ ఖరారు అయింది. నెల్లిమర్ల, విశాఖ దక్షిణ, పెందుర్తి నియోజకవర్గాల్లో పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ను త్వరలో ఖరారు చేస్తామని జనసేన నేతలు అన్నారు.
Discussion about this post