జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అస్వస్థత కారణంగా తెనాలి పర్యటన రద్దయింది. పవన్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. తెనాలిలో నిర్వహించాల్సిన రోడ్ షో, బహిరంగ సభను జనసేన రద్దు చేసింది. జ్వరంతో బాధపడుతున్న ఆయన… చికిత్స కోసం హైదరాబాద్ కు పయనమయ్యారు. దీంతో, ఆయన ప్రచారానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈరోజు తెనాలి, రేపు నెల్లిమర్లలో జరగాల్సిన పర్యటనలు వాయిదా పడ్డాయి. రీ షెడ్యూల్ చేసి పర్యటన పునః ప్రారంభిస్తామని..అనంతరం పర్యటనలు కొనసాగుతాయని , రీ షెడ్యూల్ చేసిన కార్యక్రమాన్ని త్వరలో ప్రకటిస్తామని జనసేన నాయకులు తెలిపారు.
Discussion about this post