రాష్ట్రంలో కులాలను సీఎం జగన్ విఛ్చిన్నం చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. భీమవరంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యక్తిగతంగా,, రాజకీయంగా లబ్ది పొందటానికి కులాల మధ్య జగన్ చిచ్చు పెడుతున్నారని వివరించారు. ఎమ్మెల్యే, ఎంపీ సీట్లను బీసీలకు ఇస్తున్నామంటున్న జగన్.. నిర్ణయం తీసుకునే అధికారం మాత్రం ఇవ్వటం లేదన్నారు.
గోదావరి జిల్లాల్లో కాపులు, శెట్టి బలిజలు, రాజులకు పడదని చిన్నప్పటి నుంచి విన్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు. దీనిని సరిచేయటమే తన లక్ష్యమని అన్నారు. అన్ని కులాల్లోను తన అభిమానులు ఉన్నారని చెప్పారు. అందుకే అందరి కోసం పార్టీ పెట్టానని వివరించారు.
రాజకీయాల్లో కొత్త నాయకత్వం రావాలని పవన్ కళ్యాణ్ చెప్పారు. జగన్ కులాలను విఛ్చిన్నం చేస్తే తాము ఏకం చేస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్సీ అనంతబాబు ఉదంతాన్ని వివరిస్తూ జగన్ తీరును అర్ధం చేసుకోవాలన్నారు.
Discussion about this post