జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరి యాత్రలో భాగంగా నేడు అనకాపల్లికి రానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు హెలికాప్టర్లో అనకాపల్లి డైట్ కాలేజ్ సమీపంలో గల ఒక ప్రైవేటు లేఅవుట్లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకోనున్నారు. అక్కడ నుంచి రింగ్ రోడ్డులో గల ఎన్టీఆర్ విగ్రహం కూడలి, చేపల బజారు, చిన్న నాలుగు రోడ్ల కూడలి, కన్యకా పరమేశ్వరి జంక్షన్, వేల్పుల వీధి మీదుగా నెహ్రూ చౌక్ జంక్షన్ వరకూ వారాహి వాహనంలో పవన్ కళ్యాణ్ రోడ్డు షో చేస్తారు. నాలుగు గంటలకు నెహ్రూ చౌక్ కూడలిలో వారాహి వాహనం మీద నుంచి ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లడనున్నారు.
Discussion about this post