రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో ప్రజల్లోకి పార్టీ గుర్తును బలంగా తీసుకువెళ్లే విధంగా రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తున్నారు.
వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అక్కచెల్లెళ్ల కోసం, అన్ని వర్గాల సంక్షేమం కోసం నిత్యం బటన్ నొక్కుతున్నానని, వచ్చే ఎన్నికలలో ఒకసారి ఓటర్లు అందరూ ఫ్యాన్ బటన్ నొక్కాలని పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు.
జనసేన గాజు గ్లాసు అవసరాన్ని ప్రజలకు అర్థమయ్యేలా పవన్ కళ్యాణ్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం హల్చల్ చేస్తుంది. ఆ వీడియోలో ఫ్యాన్ స్విచ్ బటన్ నొక్కగానే, ఫ్యాన్ గాలికి రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర భవిష్యత్తు, వ్యవసాయం, రాష్ట్ర ప్రజల ఉద్యోగావకాశాలు, రాష్ట్రంలోని మౌలికవసతులు, పరిశ్రమలు ఇలా అనేకం చెల్లాచెదురుగా మారాయని ఆ వీడియో ద్వారా స్పష్టం చేశారు. ఇక దానిని కాపాడాల్సిన బాధ్యతను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నారని, రాష్ట్ర అభివృద్ధి విధ్వంసం కాకుండా, ఫ్యాన్ గాలికి చెదిరిపోకుండా గాజు గ్లాస్ కాపాడుతుందని సందేశం ఇచ్చారు. చాలా సినిమాటిక్ వేలో ప్రజలకు అర్థమయ్యేలా చేసిన ఆ వీడియోలో టేబుల్ పై పెట్టిన పేపర్లు గాలికి ఎగిరి పోతుంటే, వాటిని తిరిగి తెచ్చి అవి మళ్లీ చెల్లాచెదురు కాకుండా దానిపై గాజుగ్లాసును పవన్ కళ్యాణ్ పెట్టారు.
Discussion about this post