ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ గేట్లను ఎత్తి రైతులు కాలువకు నీటిని విడుదల చేశారు. పాలేరు ఆయకట్టు పరిధిలో రబీలో సాగు చేసిన చెరుకు, వరి పంటలు ఎండిపోతుండటంతో రైతులు పాలేరు పాత కాలువ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. నీటిని విడుదల చేయాలని పలుమార్లు రైతులు అధికారులకి విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో వారు ఈ పనికి ఉపక్రమించారు. ప్రజల తాగునీటి కోసం ఉంచిన నీటిని రైతులు సాగుకు వినియోగిస్తున్నారన్న విషయం తెలుసుకున్న అధికారులు దీనిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో రైతులకు, అధికారులకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. దీంతో తమ ఎండి పోతున్న భూములకు నీటిని విడుదల చేసి తమను ఆదుకోవాలని రైతులు ఆందోళనకు దిగారు.
























Discussion about this post