ఏపీ ఎన్నికల్లో అందరి దృష్టి ఆకర్షిస్తున్న సెగ్మెంట్లో రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం కూడా వచ్చి చేరింది … వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన అడ్డగా మార్చుకున్న రాజంపేటలో ఎన్డీయే ఎంపీ అభ్యర్ధిగా మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పోటీలోకి దిగడంతో అక్కడ పొలిటికల్ వార్ ఇంట్రస్టింగ్‌గా తయారైంది.. కాంగ్రెస్‌లో ఉన్నప్పటి నుంచి చిత్తూరు జిల్లాలో కిరణ్, పెద్దిరెడ్డిల మధ్య ఆధిపత్యపోరు ఉంది .. కిరణ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్దిరెడ్డిని మంత్రి పదవి నుంచి తప్పించి ఓ ఆటాడుకున్నారు.. అలాంటి కిరణ్ ఈ సారి ఎంపీ పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డిపై పోటీకి దిగి ఆ ఫ్యామిలీతో అమితుమీ తేల్చుకోవడానికి సిద్దమవ్వడం జిల్లాలో పొలిటికల్ హీట్ పెంచేస్తోంది.
Discussion about this post