పెందుర్తిలోని పలు వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే అదీప్ రాజ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఉత్తరాంధ్ర తిరుపతిగా కొలవబడుతున్న పెందుర్తి వెంకటాద్రి ఘాట్ రోడ్డు పనులు తన హయాంలోనే జరగడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. సుమారు నాలుగు కోట్ల రూపాయల ఖర్చుతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు జరిగాయి. త్వరితగతిన పనులు ప్రారంభించి పూర్తి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు.
Discussion about this post