తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగ్గున మండుతున్నాయి. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు మారాయి. గత వారం రోజులుగా రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. ఉదయం 11 గంటలు దాటితే రోడ్లపైకి జనాలు రావడం తగ్గింది. అయితే రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశమున్నట్లు తాజాగా వాతావరణ శాఖ హెచ్చరించింది.
తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాలో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. రానున్న 3 రోజులు వడగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. భానుడి ప్రతాపానికి నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారులు, జంక్షన్ లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. జనాలు చల్లటి పానీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇదే అదునుగా పానీయాల ధరలు ఆకాశాన్ని దాటుతున్నాయి. పుచ్చకాయల ధరలు కేజీ 25 నుండి 30 రూపాయల వరకు పలుకుతున్నాయి.
Discussion about this post