విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్.. ఈ పేరు వింటే చాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉలిక్కిపడతారు. విశాఖపట్నం పరిసర ప్రాంతాలవారికైతే గుండెల్లో దడ పుడుతుంది. మూడున్నరేళ్ళ క్రితం 2020 మే 7న జరిగిన పెను విషాదం గుర్తుకువస్తుంది. ఆ కాళరాత్రి మిగిల్చిన విషాదం నుంచి వెంకటాపురం ప్రజలు ఇప్పటికీ తేరుకోలేకపోతున్నారు. అన్నివిధాలా ఆదుకుంటామని, అండగా ఉంటామని అటు ప్రభుత్వం, ఇటు ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలు నీటిమూటలుగా మారడంతో జీవచ్ఛవాల్లా బతుకుతున్నామని ఆవేదన, ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు.
Discussion about this post