అంతరించిపోతున్న నాటక రంగాన్ని జనం ఆదరించాలని రావులపాలెం సి ఆర్ సి కాటన్ కళా పరిషత్ గౌరవ అధ్యక్షులు సినీ రచయిత, నటులు తనికెళ్ళ భరణి అన్నారు. రెండవ రోజు సి ఆర్ సి, కాటన్ కళా పరిషత్ ఆధ్వర్యంలో చైతన్య కళాభారతి కరీంనగర్ వారి “చీకటి పువ్వు”,రెండవ నాటిక సిరిమువ్వ కల్చరల్ హైదరాబాద్ వారి” థింక్” మూడవ ప్రదర్శనగా మల్లాది క్రియేషన్స్ హైదరాబాద్ వారి “చీకట్లో చంద్రుడు “నాటిక పోటీలు పోటాపోటీగా
అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో సాగాయి.
రావులపాలెం crc ఆడిటరియం లో ఉగాది పర్వదినం పురస్కరించుకొని మూడు రోజులపాటు జరిగే ఈ నాటక పోటీలలో సినీ రచయిత, నటులు తనికెళ్ళ భరణి పాల్గొని మాట్లాడారు. అనంతరం దర్శకులు వంశీ, తనికెళ్ళ భరణి, విక్టరీ వెంకటరెడ్డిలు కళాకారులకు నగదు,మెమెంటోలతో సత్కరించారు. వివిధ సంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించిన చిన్నారులకు జ్ఞాపికలను అందజేశారు.
Discussion about this post