అనంతపురం జిల్లాలోని అన్ని స్థానాల్లో ఉమ్మడి అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపొందబోతున్నారని అనంతపురం నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్ధి అంబికా లక్ష్మినారాయణ అన్నారు. తమకు మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా, ఎంపీగా అవకాశం కల్పించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పారు. జిల్లాలోని బీజేపీ, జనసేన నాయకులను కార్యకర్తలను కలుపుకొని సమన్వయంతో పని చేస్తానని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఐదేళ్ల జగన్ పరిపాలనలో ప్రజలు విసిగిపోయారని అన్నారు.
అర్బన్ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ అసమ్మతి నాయకులను కలుపుకొని సమన్వయంతో ముందుకెలతానని అనంతపురం ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకట ప్రసాద్ అన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే అనంతపురం నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అర్బన్ ఏరియాలో ఇండస్ట్రీస్ ను తీసుకొచ్చి అనంతపురం అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.
Discussion about this post