PM Modi Israel : మోదీ ఇజ్రాయెల్ పర్యటన? నేతన్యాహూ ప్రకటన ఆసక్తికరం

PM Modi Israel : ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లనున్నారనే వార్తలు అంతర్జాతీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఫిబ్రవరి 25, 26 తేదీల్లో ఆయన ఇజ్రాయెల్‌ను సందర్శించే అవకాశం ఉందని సమాచారం. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఒక సదస్సులో వెల్లడించినట్లు తెలుస్తోంది. వచ్చే వారం తమ పార్లమెంట్‌ను ఉద్దేశించి మోదీ ప్రసంగం చేసే అవకాశముందని కూడా ఆయన పేర్కొన్నారు.

ఇండియా–ఇజ్రాయెల్ మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయని, పరస్పర సహకారం మరింత బలోపేతం చేసుకునే దిశగా చర్చలు జరగనున్నాయని నెతన్యాహూ తెలిపారు. భారత్‌ను శక్తివంతమైన దేశంగా పేర్కొంటూ ఇరు దేశాల భాగస్వామ్యం వ్యూహాత్మకంగా కీలకమని అన్నారు.

అయితే ఈ పర్యటనపై భారత ప్రభుత్వం నుంచి అధికారిక (PM Modi Israel) ప్రకటన ఇంకా వెలువడలేదు. పర్యటన జరిగితే ఇది మోదీ రెండో ఇజ్రాయెల్ పర్యటన అవుతుంది. 2017 జూలైలో ఆయన మొదటిసారి ఇజ్రాయెల్‌ను సందర్శించారు. గాజా యుద్ధం అనంతరం జరిగే తొలి పర్యటనగా ఇది ప్రాధాన్యత సంతరించుకునే అవకాశం ఉంది.

ఈ పర్యటన జరిగితే పశ్చిమ ఆసియాలో శాంతి, భద్రత పరిస్థితులపై చర్చలు జరిగే అవకాశం ఉంది. రక్షణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, వ్యవసాయం వంటి రంగాల్లో ద్వైపాక్షిక సహకారం మరింత బలోపేతం కావచ్చు. ముఖ్యంగా డ్రోన్ సాంకేతికత, క్షిపణి వ్యవస్థలు, నిఘా పరికరాలు, సెమీకండక్టర్ రంగాల్లో ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

Follow for more updates

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top