మోదీ కేబినెట్ లో భారీ మార్పులు ! | PM Modi Key Changes In Central Cabinet

దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి! కొద్దిసేపటి క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో హఠాత్తుగా భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే అత్యంత హాట్ టాపిక్‌గా మారింది.రాబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, పార్టీ బలోపేతాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధాని మోదీ తన సరికొత్త టీమ్‌ను సిద్ధం చేస్తున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం.

పనితీరు సరిగ్గా లేని పాత మంత్రులకు ఉద్వాసన పలకడం ఖాయంగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే కేంద్ర సహాయ మంత్రి జార్జ్ కురియన్ తన పదవికి రాజీనామా చేశారు.మరోవైపు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన ‘నీట్’ పరీక్షల వివాదం.. ప్రస్తుత విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవికే ఎసరు తెచ్చేలా ఉంది. విమర్శలు ఎదుర్కొంటున్న ఆయన్ను మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.

అయితే ఈ పునర్వ్యవస్థీకరణలో కొన్ని అనూహ్య చేరికలు ఉండబోతున్నాయి! ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీని వీడి ఇటీవలే బీజేపీలో చేరిన యువ నేత రాఘవ్ చడ్డాకు కేంద్ర క్యాబినెట్‌లో కీలక బాధ్యతలు అప్పగించబోతున్నట్లు సమాచారం. ఢిల్లీ, పంజాబ్ రాజకీయాలపై పట్టున్న చడ్డాను రంగంలోకి దించడం ద్వారా.. అక్కడ ఆప్-కాంగ్రెస్ కూటమిని దెబ్బతీయాలని బీజేపీ మాస్టర్ ప్లాన్ వేసింది!

  • రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ భేటీ!
  • కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తథ్యం!
  • కేంద్ర మంత్రి పదవికి జార్జ్ కురియన్ రాజీనామా!
  • విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై వేటు పడే అవకాశం?
  • ఆప్ నుంచి బీజేపీలోకి వచ్చిన రాఘవ్ చడ్డాకు మోదీ కేబినెట్‌లో బెర్త్?

Follow for more updates

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top