గుమ్మడిదొడ్డి గ్రామంలో విష జ్వరాలు ఉన్నట్లు రాష్ట్ర వైద్య బృందానికి తెలిసింది. గ్రామంలో ప్రభుత్వ సీనియర్ వైద్యులు, ఆశా వర్కర్ల ఆధ్వర్యంలో రక్త నమూనాలు సేకరిస్తున్నారు. వీటి ఆధారంగా చికిత్స చేస్తున్నారు. ఇళ్లు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, శానిటైజర్ వాడాలని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.
Discussion about this post