మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం గోప్లాపూర్ గ్రామంలో పోలీస్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు మూడు క్వింటాల 20 కేజీలు నకిలీ బీటీ త్రీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా గుంటూరు ప్రాంతం నుండి దిగుమతి చేసుకొని అక్రమంగా పత్తి విత్తనాలను నిలువ ఉంచుతున్నరన్నారు. ఇందులోని ఇద్దరు నిందితులు ప్రభాకర్ రెడ్డి, సుధాకర్‌రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎవరైనా నకిలీ విత్తనాలను అమ్మితే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు.
Discussion about this post