ఏపీలో శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఎప్పుడూ ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి. ఆ జిల్లాలోని పలాస నియోజకవర్గంలో రాజకీయాలు రసవరత్తరమే… ఇక ఈ జిల్లాలో ప్రస్తుతం సవాళ్లు, విమర్శలు, వార్నింగ్‌లతో రసవత్తరంగా సాగుతున్నాయి రాజకీయాలు. మంత్రి సీదిరి అప్పలరాజు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే గౌతు శిరీష మధ్య పీక్ వార్‌గా మారిపోయింది.. 2019 ఎన్నికల్లో వీరిద్దరి మధ్య రాజకీయ యుద్ధం మొదలైంది. ఈ ఎన్నికల్లో కూడా వీరువురి మధ్య గట్టి పోటీ ఉంది. ఇరువురు సై అంటే సై అంటూ ముందుకు కదులుతున్నారు.
శ్రీకాకుళం జిల్లాల్లో రాజకీయ చైతన్యం కలిగిన నియోజకవర్గాల్లో పలాస ఒకటి. ఈ నియోజక వర్గం తెల్లబంగారంగా పిలవబడే జీడి పప్పు పంటకు కేరాఫ్ అడ్రస్ గా
నిలిచింది. ఇక్కడ రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గానే ఉంటాయి. 2019 ఎన్నికల్లో వైద్య వృత్తి నుండి రాజకీయాల్లోకి వచ్చిన సీధిరి అప్పలరాజు విజయం సాధించి ఐదేళ్లు మంత్రిగా పనిచేసి.. మరో మారు తన అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు.. ఇక గౌతు కుటుంబానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన పలాసలో తమ ఉనికి కాపాడుకుందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.
పలాస గా పిలవబడే ఈ నియోజకవర్గం 1952 లో సోంపేట నియోజకవర్గం పేరుతో ఏర్పాటైంది. అప్పటి నుండి ఈ నియోజక వర్గంనుండి స్వాతంత్ర్య సమరయోధుడు
గౌతు లచ్చన్న ఏడు పర్యాయాలు పోటీ చేయగా ఆరు సార్లు విజయం సాధించారు. 1983 లో కాంగ్రెస్ పార్టీ తరుపున మజ్జి నారాయణ రావు గౌతు లచ్చన్న పై విజయం సాధించి రికార్డు సృష్టించారు. టీడీపీ ఆవిర్భా వం తో 1985 నుండి ఇక్కడ నుండి గౌతు లచ్చన్న కుమారుడు గౌతు శ్యామ్ సుందర్ శివాజీ విజయం సాధిస్తూ వచ్చారు.
1989లో మాత్రంఅప్పటి రాజకీయ పరిణామాల మూలంగా శివాజీ ఇండిపెండెంట్ గా
పోటీ చేసి శాసన సభకు ఎన్నికయ్యారు. తరువాత టీడీపీలో చేరి అప్పటి నుండి నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా గౌతు శివాజీ సోంపేట నుండి పలాస మారగా ఆ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి జుత్తు జగన్నాయకులు శివాజీ పై విజయం సాధించారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో తిరిగి శివాజీ వైసిపి అభ్య ర్థిపై విజయం సాధించారు. 2019 ఎన్నికలకు శివాజీ రాజకీయ వారసురాలిగా తన కుమార్తె శిరీషను పోటీలో దింపారు. ఆ ఎన్నికల్లో శిరిషపై వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ సీధిరి అప్పలరాజు విజయం సాధించారు. ప్రస్తుతం అప్పలరాజు మంత్రిగా కొనసాగు తున్నారు.
పలాస నియోజక వర్గంలో పలాస మున్సిపాల్టీతో పాటు పలాస, వజ్రపుకొత్తూరు, మందస మండలాలు కలవు. పూర్తిగా వ్యవసాయమే ప్రధాన జీవనాధారం చేసు
కుని ఇక్కడి ప్రజలు జీవిస్తుంటారు. ఈ ప్రాంతం జీడి, కొబ్బరి, మామిడి పంటలకు పెట్టింది పేరు. వరి పంట ను కూడా పండిస్తారు. పూర్తిగా వర్షాధారం పైనే ఇక్క్కడి రైతులు వ్యవసాయం సాగు చేస్తూ ఉంటారు. ఈ నియోజకవర్గంలో 2,17,815 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,06, 465 మంది పురుషులు, 1,11,329 మంది స్త్రీలు కాగా 21 మంది ట్రాన్సు జెండర్సు కలదు.
పూర్తిగా వర్షాధారం పై తమ భూములు సాగుచేస్తున్న రైతాంగానికి సాగు నీరు అందించేం దుకు దివంగత మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి టెక్కలి వద్ద అప్షోర్ రిజర్వాయర్ నిర్మించి అక్కడి నుండి పలాస, ఇచ్ఛాపురం నియోజక వర్గాలకు సాగు నీరు అందేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. కొద్ది నెలలకు పనులు ప్రారంభించినా అది పూర్తి కాకపోవడం తో రైతులకు సాగు నీరు అందలేదు. 2014 లో టీడీపీ ప్రభుత్వంలో స్థానిక శాసన సభ్యులు శివాజీ చివర ఏడాది పోరాడి నిధులు కేటాయించి టెండర్లు పిలిచినా ప్రభుత్వం మారడంతో వాటిని రద్దు చేశారు.
మంత్రిగా అప్పలరాజు ఐదేళ్లు మంత్రిగా కొన సాగినా సాగునీరు అందజేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారని ఆరోపణలు వస్తున్నాయి…దీనితో పాటు అంతర్జాయ గుర్తింపు పొందిన జీడి పంటకు, పప్పుకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూడా మంత్రి వైఫ ల్యం చెందారని విమర్శలు వస్తున్నాయి. అలాగే మున్సిపాలిటీలో పారిశుధ్యం, త్రాగునీరు అంధించం లో కూడా మంత్రి నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలు వస్తున్నాయి.
మంత్రి సీధిరి అప్పల రాజు ఎప్పుడూ రాజకీయాల్లోదూకుడుగా వ్యవహరిస్తారు. సందర్భం వచ్చినప్పుడు చంద్రబాబు, లోకేష్ తో పాటు గౌతు కుటుంబాన్ని సైతం చెడుగుడు అడుకుంటారు…ఇటీవల తన నిర్ణయాల వల్ల పార్టీలో చాలా మంది సీనియర్ నాయకులు, మున్సిపల్ కౌన్సులర్లు అప్పలరాజుని వదలి వేరే కుంపటి పెట్టుకున్నారు….నాలుగోవిడత ఎన్నికల నామినేషన్ల గడువు మరో వారం రోజులే గడువు ఉండగా ఇప్ప టికే నియోజక వర్గం లో ప్రచారం స్పీడెక్కించారు. గ్రామాల్లో కార్యకర్తలతో డాన్సులు,స్టెప్లు వేస్తూ ప్రచారాన్ని స్పీడు పెంచాడు సీదిరి అప్పలరాజు. అదే స్పీడుతో ప్రతిపక్ష పార్టీ వారు తనకు పోటీ యే కాదని తన విజయం
వైసిపి అభ్యర్థి అప్పల రాజుపై గౌతు శిరీష మరో మారు పోటీ చేస్తున్నారు. మంత్రి వ్యతిరేక వర్గాన్ని కూడా గట్టి తమ వైపు తిప్పుకున్నారు. ప్రభుత్వం పై ప్రజలలో ఉన్న వ్యతిరేకతకు క్యాష్ చేసుకుందుకు ప్రయత్నిస్తున్నారు. శ్రీకాకుళం టీడీపీ ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడుని వెంటబెట్టుకుని నియోజకవర్గంలో విస్త్రృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కార్యకర్తలు జోష్ నింపుతు ముందుకు సాగుతున్నారు. వారిని ఉత్తేజ్ పరిచేందుకు డాన్సులు చేస్తూ స్టెప్స్ వేస్తూన్నారు. గత ఎన్నికల్లో ఓటమి చెందిన ఎందులోనూ తగ్గక దీటుగా మంత్రిని ఎదుర్కొని గౌతు వారి సత్తా చూపించేందుకు తహ తహ లాడుతున్నారు.
ఎండలు మండిపోతున్నాయి… అదే విధంగా రాజకీయాల్లో కూడా వేడీ రాజకుంటుంది… ఎవరికి వారు విజయ ధీమాతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నియోజక వర్గంలో ఒకరికి మరొకరు తీసిపోకుండా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబుపై మంత్రి అప్పలరాజు పదునైన విమర్శలు చేస్తుంటే.. జగన్, మంత్రి అప్పలరాజులపై అదే స్పీడుతో టీడీపీ అభ్యర్థి శిరీష ఎదురు దాడి చేస్తున్నారు. విమర్శలు.. ప్రతి విమర్శలు చేసుకుంటున్నా… ప్రజలు ఎవరువైపు మొగ్గుతారు… గెలుపు ఎవరిని వరిస్తుంది… ప్రజల తీర్పు ఎలా ఉంటుంది తెలుసు కోవాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే…
Discussion about this post