ఏపీలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు అభ్యర్థుల జాబితా వెలువడకపోవడంతో తర్జన భర్జన పడ్డ రాజకీయ పార్టీలలో జోష్ పుంజుకుంది. సై అంటే సై అనే రీతిలో నియోజకవర్గ అభ్యర్థులు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలు ఒక ఎత్తైతే విశాఖ పరిధిలోని గాజువాక నియోజకవర్గం మరోఎత్తు అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అధికార వైసీపీలో కల్లోలం మొదలయ్యింది. గాజువాక టికెట్ మంత్రి గుడివాడకు కేటాయించడంతో అసంతృప్తి సెగలు రాజుకుంటున్నాయి. అనకాపల్లి శాసన సభ్యునిగా, మంత్రిగా ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిన అమర్నాథ్ ను…గాజువాక తీసుకురావడం పట్ల పార్టీలోని సీనియర్లు గుర్రుగా వున్నారు. తిప్పల నాగిరెడ్డిని తప్పించడాన్ని సైతం వైసీపీ కార్యకర్తలు తప్పుపడుతున్నారు. విశాఖలో శరవేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలుపై మా వైజాగ్ ప్రతినిధి చందు మరిన్ని విషయాలు గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా వెల్లడిస్తారు.
Discussion about this post