విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని రాంకీ, వసుధ, పీ ఫైజర్ తదితర ఫార్మా పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం పరిసర గ్రామాలను పట్టి పీడిస్తోంది. ప్రధానంగా తాడి గ్రామ ప్రజలు ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. నీరు, గాలి పూర్తిగా కలుషితమవటంతో రోగాలపాలై అల్లాడిపోతున్నారు. సమస్యను పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు స్వార్ధ ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నారు. కాలుష్యం కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని మరో చోటికి తరలిస్తామని సీఎం జగన్ ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేరలేదు. దీనిపై టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో తాడి గ్రామ తరలింపునకు జీవో జారీ అయిందని.. పెదముషిడివాడ వద్ద స్థలం కూడా ఎంపిక చేశారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పల నాయుడు చెబుతున్నారు. సీఎం జగన్ ధనదాహం వల్లే తాడి గ్రామ సమస్య పరిష్కారం కావడం లేదంటున్న అప్పలనాయుడు స్పందన.
Discussion about this post