నల్లగొండ జిల్లా నకిరేకల్ లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా వేముల వీరేశం ఎన్నికవడం, పార్టీ అధికారంలోకి రావటంతో భారీ ర్యాలీ నిర్వహించి సందడి చేశారు. రాష్ట్ర రెవెన్యూ,సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
విజయోత్సవ ర్యాలీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ తెలంగాణకు చేసింది ఏమీ లేదన్నారు.కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు దోపిడీ చేసిందని, దానిని కక్కిస్తామని చెప్పారు. ధరణి పోర్టల్ ద్వారా దోచుకున్న భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంపిణీ చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని చెప్పారు. సంక్రాంతిలోగా ఇందిరమ్మ ఇళ్లపై శుభవార్త చెబుతామన్నారు.
Discussion about this post