రాజాసింగ్ కు జ్యోతిషం తెలుసా అని ఫైర్
తెలంగాణలోని 110 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయిన బీజేపీ నాయకులు ప్రభుత్వం కూలుతుందని చెప్పడం ఏమిటని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కుట్ర చేస్తున్నారా.. అని నిలదీశారు. దీనిని సమాజం సహించదని పొన్నం అన్నారు.
10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెప్పడానికి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు జ్యోతిష్యం తెలుసా అని మంత్రి ప్రశ్నించారు. సిద్దిపేట పట్టణంలోని డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో మంత్రి పొన్నం మార్నింగ్ వాక్ చేస్తూ వాకర్స్ తో మాట్లాడి సమస్యల్ని తెలుసుకున్నారు. ప్రతిపక్షాల వారు, ప్రజలు ఏ సమస్య ఉన్నా నేరుగా కలవవచ్చని చెప్పారు. సలహాలు ఇవ్వాలి కానీ లేనిపోనివి మాట్లాడవద్దన్నారు. సీనియారిటీ ప్రకారం ప్రొటెం స్పీకర్ ను నియమించామని, దీనిని మత పరంగా చూడొద్దని అన్నారు.
Discussion about this post