ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మాట తప్పారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి విమర్శించారు. ఖమ్మం నగరంలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 90 రోజులు దాటినా హామీలు మాత్రం నెరవేరలేదన్నారు. రైతు బంధు మొత్తాన్ని 15 వేలకు పెంచుతామని చెప్పి గతంలో ఉన్న 10 వేల రూపాయలను కూడా ఇవ్వటం లేదన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
Discussion about this post