రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కల్కి 2898AD. స్టార్ ప్రొడ్యూసర్ కే.అశ్వినీదత్ వైజయంతి మూవీస్ బ్యానర్లో అత్యంత ప్రతిష్టాక్మంగా భారీ బడ్జెట్‌తో అగ్రకథనాయకులతో ఈ సినిమా రూపొందిస్తున్నారు. చిత్ర ప్రమోషన్లో భాగంగా రామోజీ ఫిల్మ్ సిటీలో కల్కీ 2898ఏడీ బుజ్జి వర్సెస్ భైరవ పేరుతో ఓ స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు.
ఎంతో అట్టహాసంగా జరిగిన ఈ ఈవెంట్ లో భైరవ, బుజ్జీ వీడియోను కల్కి టీమ్ రిలీజ్ చేసింది. ఈ వీడియో అద్భుతమైన విజువల్స్‌తో అబ్బురపరిచేలా ఉన్నాయి. బుజ్జీ వాహనానికి ఉండే బ్రెయిన్ డైలాగ్‌తో మొదలైన ఈ షార్ట్ వీడియో రెబల్ స్టార్ అభిమానులకు కిక్కిచ్చింది. ఈ సీన్స్ చూశాక ప్రభాస్ అభిమానుల్లో ఉన్న అంచనాలు రెట్టింపయ్యాయి. ప్రతీ ఫ్రేమ్ స్టన్నింగ్‌గా ఉంది. ఈ చిత్రం విజువల్ వండర్లా ఉంటుందని ఈ వీడియో ప్రూవ్ చేసింది. పురాణాల ఆధారంగా ఎపిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రంగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విష్ణుమూర్తి పదో అవతారంగా భావించే కల్కి ఆధారంగా ఈ మూవీలో ప్రభాస్ భైరవ క్యారెక్టర్ ఉండనుంది. ఈ మూవీ గ్లోబల్ రేంజ్లో జూన్ 27న రిలీజ్ కానుండగా…సినిమాలో బుజ్జీ అనే ప్రత్యేక వాహనం గురించి కొంతకాలంగా హైప్ నెలకొని ఉంది. ఈ వెహికల్‌ను ప్రపంచానికి పరిచయం చేసేందుకు భారీ ఈవెంట్ మూవీ టీమ్ నిర్వహించింది. కల్కి టీమ్ చేసిన తొలి ప్రమోషనల్ ఈవెంట్ ఇదే.
బుజ్జీ వాహనానికి ఉండే బ్రెయిన్ డైలాగ్‌తో ఈ వీడియో మొదలైంది. ఈ మిషన్ అసాధ్యమని.. షారుఖ్ ఖాన్ నామూన్కిన్ ఐకానిక్ డైలాగ్ బుజ్జీ చెప్పడంతో ఈ వీడియో షురూ అయింది. అయితే, ఫుల్ స్పీడ్‌లో వెళ్లాలని బుజ్జీకి భైరవ ఆదేశాలు ఇస్తాడు. ఈ ఒక్క రోజు పాజిటివ్‌గా ఉండాలని బైరవ అడిగితే.. తిరుగేలేదని భైరవ అంటాడు. ఈ బుజ్జి వెహికల్ అత్యంత వేగంతో వెళుతూ గాల్లోకి ఎగిరేలా కూడా ఉండి… చూసేందుకు అద్భుతంగా కనిపిస్తోంది. లవ్ యూ బుజ్జీ అని భైరవ అంటే.. పర్లేదులే అని బుజ్జీ బ్రెయిన్ అంటుంది. కల్కి 2898 ఏడీ మూవీలో భైరవ, అతడి స్పెషల్ వెహికల్ బుజ్జీ మధ్య కెమెస్ట్రీ, సంభాషలు ఫన్నీగా, అదిరిపోయేలా ఉంటాయని ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది. ఇక, బుజ్జీ వాహనానికి స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం మరో హైలైట్‌గా ఉంది. కల్కి 2898 ఏడీ టీమ్ రిలీజ్ చేసిన భైరవ, బుజ్జీ వీడియోలో విజువల్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. ప్రతీ ఫ్రేమ్ స్టన్నింగ్‌గా ఉంది. ఈ చిత్రం విజువల్ వండర్లా ఉంటుందని మరోసారి భారీ నమ్మకాన్ని ఇచ్చేసింది. భారీ హాలీవుడ్ మూవీ రేంజ్లో ఔట్‌పుట్‌ను దర్శకుడు నాగ్అశ్విన్ సాధించారు. స్టొజిల్జోవిక్ సినిమాటోగ్రఫీ, సంతోష్ నారాయణన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా టాప్ నాచ్గా ఉంది.
కల్కి 2898 ఏడీ మూవీ కోసం ప్రత్యేకంగా నిర్మించిన కారు ఈ బుజ్జి. ఇది ఇండియాలోనే అతిపెద్దదిగా చెబుతున్నారు. ఈ మాన్స్టర్ కారు బరువు ఆరు టన్నులు కావడం విశేషం. స్టార్ స్టార్ రెబల్ స్టార్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఈ కారును దగ్గర నుంచి చూపించే వీడియోను పోస్ట్ చేసింది. రేణుకా కృపలానీ అనే వ్యక్తి ఈ కారు ప్రత్యేకతల గురించి వివరించారు. ఓ సినిమా కోసం ఇలాంటి కారును నిర్మించడం నమ్మశక్యం కాదు.. దీనిని దగ్గర నుంచి చూస్తుంటే భవిష్యత్తు నుంచి వచ్చినట్లుగానే కనిపిస్తోంది.. ఈ కారు ముందు టైరు నా భుజం వరకు ఉంది అని ఆమె వివరిస్తూ వెళ్లింది. ఈ కారు ముందు టైరు రిమ్ సైజు 34.5 అంగుళాలు. ఈ కారు పొడవు 607.5 సెం.మీ., వెడల్పు 338 సెం.మీ., ఎత్తు 218.6 సెం.మీ.లు కావడం విశేషం. మొత్తంగా కారు బరువు 6 టన్నులు. ఈ కల్కి 2898 ఏడీ మూవీలో ఈ కారును భైరవ పాత్రే సొంతంగా తన చేతులతో ఈ కారును తయారు చేసినట్లుగా చూపించారు. కారు వెనుక భాగంలోని ఛాంబర్ లో హీరో తాను బంధించిన వారిని ఉంచేందుకు వాడతారట. ఇక ఈ కారు వెనుక భాగంలో చాలా పెద్దగా ఉన్న ఒకే టైరు ఉంది. దీని సాయంతోనే ఈ కారు ఎటు కావాలంటే అటు వెళ్తుంది.
అంతకుముందు మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా ఈ కారు తయారీలో తమ పాత్ర గురించి ఓ ట్వీట్ లో వెల్లడించాడు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ కోరిక మేరకు తమిళనాడులోని కోయంబత్తూర్ లో ఉన్న జయం మోటార్స్ ఈ కారు తయారీలో మేకర్స్ కు సాయం చేసింది. కల్కి 2898 ఏడీ మూవీలో ప్రభాస్ వాడే కారు ఇది. బుజ్జీని పరిచయం చేసేందుకు కల్కి 2898 ఏడీ టీమ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో నేడు అట్టహాసంగా జరిగింది. ఈ ఈవెంట్లో బుజ్జీతో ప్రభాస్ ఇచ్చిన ఎంట్రీ అదిరిపోయింది. భైరవ గెటప్‌లోనే ఈ ఈవెంట్లో ప్రభాస్ కనిపించారు. డార్లింగ్ లుక్స్ స్టన్నింగ్‌గా ఉన్నాయి. కల్కి 2898 ఏడీ సినిమాలో కీలకపాత్రల్లో నటిస్తున్న బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్‌హాసన్‌కు ప్రభాస్ థ్యాంక్స్ చెప్పారు. దీపికా పదుకోణ్ను సూపర్ స్టార్ అంటూ ప్రశంసించారు. ఈ మూవీలో దీపికా, దిశా పటానీ కూడా కీరోల్స్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. జూన్ 27వ తేదీన ఈ మూవీ రిలీజ్ కానుంది.
Discussion about this post