వికసిత భారత్ ధ్యేయంగా కొనసాగుతోన్న భారతీయ జనతాపార్టీకి ఈ ఎన్నికలలో పట్టం గట్టేందుకు సిద్దంగా ఉండాలని ఎంపీ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. ప్రకృతి వనరులను కొల్లగొట్టి, ప్రజా ధనాన్ని దుర్వినియోంచేసే పాలన ప్రమాదకరమన్నారు. సచివాలయాన్నే తాకట్టు పెట్టిన ప్రజా కంఠక పాలన జగన్మోహన్ రెడ్డి దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురందరేశ్వరి అన్నారు. అసమర్థ పాలనతో ఆర్థిక సంక్షోభం తలెత్తే ప్రమాదముందన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వరితో కలిసి నెల్లూలో నిర్వహించిన కార్యకర్తల బహిరంగ సమావేశంలో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడారు. తొలుత నెల్లూరు లోని ప్రభుత్వ వైద్యకళాశాలకు చేరుకొని మొక్కలు నాటారు. మోడీ గ్యారెంటీ పేరున సాగుతున్న వాల్ పెయింట్ లో పాల్గొన్నారు. రానున్న ఎన్నికలలో బీజేపీ 400 సీట్ల సంఖ్యతో ప్రభుత్వాన్ని కొనసాగించ నుందని వికసిత్ భారత్ సాధన సాకారం దిశగా ఎనలేని ప్రయోజనం దేశానికి అందనుందన్నారు. ఈ విషయంలో నెల్లూరు కూడా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్యక్షులు పురందరేశ్వరి మీడియా తో మాట్లడుతూ పొత్తులపై పార్టీ నుంచి స్పష్టమైన ఆదేశాలు అందాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో పరిపాల అప్పులు, తాకట్టుల పర్వంగా సాగుతూ జగన్మోహన్ రెడ్డి ప్రజాకంఠకులయ్యాని తొలగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తీవ్ర విర్శలు చేశారు.
Discussion about this post