ప్రజావాణి కార్యక్రమంతో ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కారం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 91 మంది అర్జీలను స్వీకరించామని తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయాలంటే అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని, ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి… అర్హతలను బట్టి మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
Discussion about this post