కన్నడ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్స్ ను లైన్లో పెట్టాడు. వాటిలో ఒకటి ప్రభాస్ సలార్ 2 కాగా.. మరొకటి ఎన్టీఆర్ తో తెరకెక్కించే చిత్రం. సలార్ 1 సెన్సేషనల్ హిట్ అవ్వడంతో.. సలార్ 2 ని వీలైనంత తొందరగా పూర్తిచేయాలని భావించాడు ప్రశాంత్ నీల్. సలార్ 1 తో పాటే.. సీక్వెల్ కి సంబంధించి 20 శాతం వరకూ షూటింగ్ పూర్తయ్యిందట. ఇప్పుడు సీక్వెల్ ని ఈ ఏడాది కొంత భాగం పూర్తిచేసి వచ్చే యేడాది మొత్తం ఫినిష్ చేయాలని చూస్తున్నాడట ప్రశాంత్ నీల్. మరోవైపు.. ఇటీవలే ఎన్టీఆర్ తో ప్రశాంత్ తెరకెక్కించే చిత్రం ముహూర్తాన్ని జరుపుకుంది. త్వరలో పట్టాలెక్కే ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్.. 2026 జనవరిలో విడుదలకు సిద్ధం కానుంది. ఇక.. ప్రభాస్, ఎన్టీఆర్ సినిమాలతో పాటు.. మరో లాంగ్ పెండింగ్ ప్రాజెక్ట్ ‘కె.జి.యఫ్ 3’ని కూడా పూర్తి చేయాలనే కృత నిశ్చయంతో ఉన్నాడట కన్నడ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. వచ్చే యేడాది చివరి నుంచి ‘కె.జి.యఫ్ 3’ని పట్టాలెక్కించాలనే ప్రణాలిక సిద్ధం చేస్తున్నాడట. ఇటీవలే ‘కె.జి.యఫ్-3’ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హోంబలే ఫిల్మ్స్ అధినేత విజయ్ కిరంగదూర్. ఇప్పటికే ‘కె.జి.యఫ్-3’ కథ సిద్ధమైందని.. 2025 చివరి నుంచి షూటింగ్ మొదలవుతుందని ఆయన తెలియజేశారు. మొత్తంమీద.. సూపర్ డూపర్ హిట్ సిరీస్ ‘కె.జి.యఫ్’లో థర్డ్ ఇన్స్టాల్ మెంట్ కోసం యావత్ భారతదేశంలోని సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Discussion about this post