రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంట్ స్థానాల్లో మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానాన్ని రాష్ట్ర నాయకులతో పాటు, జాతీయ నాయకులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా భారీ బహిరంగ సభలు, కార్నర్ మీటింగులు, రోడ్ షోలు నిర్వహించారు. గతంతో పోలిస్తే ఈ సారి నియోజకవర్గంలో పోలింగ్ శాతం పెరిగింది. ఉదయం నెమ్మదిగా సాగిన పోలింగ్ సాయంత్రానికి పుంజుకోగా… ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గుచూపారనే ఆందోళన అభ్యర్ధులలో నెలకొంది. నియోజకవర్గంలో ఈ సారి బీఆర్ఎస్ ప్రభావం చూపలేదని, రెండు జాతీయ పార్టీల మధ్యే హోరాహోరీ కొనసాగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Discussion about this post