ఏదో ఆశిస్తే ఇంకేదో జరిగింది ఆ ఇద్దరి విషయంలో… వైసీపీ నుంచి విజయనగరం ఎంపీగా పోటీలో ఉన్న బెల్లాన చంద్రశేఖర్, టీడీపీ అభ్యర్ధి కలిశెట్టి అప్పలనాయుడు కాపు వర్గీయులే .. నియోజకవర్గంలో ప్రభావితంగా ఉన్న ఆ సామాజికవర్గం లెక్కలతోనే వారిని బరిలోకి దింపాయి పార్టీలు.. విశేషమేంటంటే ఆ ఇద్దరు నేతలు ఈ సారి ఎచ్చెర్ల ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు .. అయితే ఈక్వేషన్లు కలిసిరాక ఎంపీ అభ్యర్ధులయ్యారు… పేరుకి వారిద్దరే పోటీలో ఉన్నా.. విజయనగరం సమరం మాత్రం బొత్స, గజపతిలకు ప్రెస్టేజ్ ఇష్యూగా మారింది
విజయనగరం పార్లమెంటు సెగ్మెంట్ లో ఈ ఎన్నికల్లో ఎవరెవరు తలపడనున్నారు అనేదానిపై క్లారిటీ వచ్చింది… వైసీపీ నుండి సిట్టింగ్ ఎంపి బెల్లాన చంద్రశేఖర్, కూటమి అభ్య ర్ధిగా టీడీపీ నాయకులు కలిశెట్టి అప్పలనాయుడు పోటీ పడనున్నారు … కలిశెట్టి మొదటి నుండి పార్టీకి లాయల్టీగా ఉండగా, బెల్లాన మొదట కాంగ్రెస్‌లో ఇపుడు వైసీపీలో ఉన్నారు … ఇద్దరూ కాపు సామాజిక సామాజిక వర్గానికి చెందినవారే.. ఆయా పార్టీల నుండి ఎచ్చెర్ల అసెంబ్లీ టికెట్ ఆశించినవారే కావడం గమనార్హం… కానీ సమీకరణాలు అనుకూలించకపోవడంతో పార్లమెంటు బరిలో దిగారు .
సిట్టింగ్ ఎంపి బెల్లాన గత ఎన్నికల్లో గెలిచి జెయింట్ కిల్లర్ అనిపించుకున్నారు… అప్పట్లో జగన్ హవా, జనసేన, బీజేపీలు చీల్చుకున్న ఓట్లు కలిసి వచ్చి బెల్లాన స్వల్పమెజార్టీతో అశోక్ గజపతిరాజుపై విజయం సాధించారు .. గతంలో జడ్పీ ఛైర్మన్‌గా పనిచేసిన ఆయనకు అటు బొబ్బిలి నుండి ఇటు ఎచ్చెర్ల వరకు పార్లమెంటు సెగ్మెంట్ వ్యాప్తంగా మంచి పరిచయాలతో పాటు బంధుగణం కూడా ఎక్కువే.. ఇక మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లికి స్థానికుడు కావడంతో ఆయనతో సన్నిహిత సంబధాలున్నాయి.. అందుకే బొత్స తన మేనల్లుడు చిన్న శ్రీనుని కాదని బెల్లానకి టికెట్ ఇప్పించారు …
విజయనగరం ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్రస్వామి, గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య , బొబ్బిలి ఎమ్మెల్యే సంబంగి వంటివారు కూడా బెల్లానకు పూర్తి మద్దతు తెలుపుతున్నారు … బెల్లాన కూడా సౌమ్యుడు కావడంతో పార్టీలో ఎవరితోనూ విబేధాలు లేవు.. అయితే ఎంపీగా ఆయన పార్లమెంటు సెగ్మెంట్‌కు ఏం చేయలేదన్న నెగిటివ్ ఉంది … చిన్న, చితకా పనులు తప్ప ఒక్క చెప్పుకోదగ్గ అభివృద్ధి కార్యక్రమం కూడా గత అయిదేళ్లలో చేపట్టలేదన్న విమర్శలున్నాయి .
విజయనగరం మార్కెట్ ఏరియాలో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని ఎంపీగా ఆయనే ప్రారంభించినప్పటికీ అది ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు … ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్న మానాపురం రైల్వే గెట్ కి సంబంధించి కనీస చర్యలు చేపట్టలేకపోయారు … పార్లమెంటు నిధులతో ఎం చేశారంటే టక్కున గుర్తొచ్చేది… ఒక్కటంటే ఒక్కటి కూడా లేదంటే అతిశయోక్తి కాదు . .. అయితే ఏదో చేసేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారు
ఇక కలిశెట్టి అప్పలనాయుడు విషయానికి వస్తే .. ముందు నుంచి ఆయన టీడీపీలోనే ఉన్నా.. కింది స్థాయి కేడర్ తో పెద్దగా పరిచయాలు లేవు … గతంలో టీడీపీ ట్రైనింగ్ క్లాసులకి ఉత్తరంధ్రలో ట్రైనర్ గా వ్యవహరించడమే ఆయనకున్న ప్లస్ … ఒక్క ఎచ్చెర్ల నియిజకవర్గంలో తప్ప మిగిలిన ఆరు సెగమెంట్లలో ఆయనకు పెద్దగా పరిచయాలు లేవు… కూటమి అభ్యర్ధి కావడం , పొలిట్ బ్యూరో సభ్యులు కేంద్ మాజీమంత్రి అశోక్ గజపతిరాజు ఆశీస్సులు ఆయనకు సానుకూలాంశంగా కనిపిస్తున్నాయి.. ఇప్పటికీ చీపురుపల్లి, నెల్లిమర్ల, గజపతినగరం వంటి నియోజకవర్గాల్లో టీడీపీ విభేదాలు కొలిక్కి రాలేదు .
అయితే వాటన్నిటినీ చక్కదిద్దగలిగే సామర్ధ్యం అప్పలనాయుడుకి ఉందన్న ప్రచారం నడుస్తున్నా… ఎంత వరకు సెట్‌రైట్ అవుతాయన్నది అనుమానమే అంటున్నారు.. తాజాగా విజయనగరం లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్ధుల ఆత్మీయ సమావేశం అని అశోక్ గజపతి పిలుపునిస్తే కలిశెట్టితో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్ధులు మాత్రమే హాజరయ్యారు …. సీనియర్ నాయకులు కళా వెంకటరావు ,కొండ్రు మురళి ,బేబీ నాయన, ఎన్ఈఆర్ లు డుమ్మా కొట్టారు … దాంతో వారి వైఖరి పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది
జిల్లాలో కాపులను సమన్వయం చేసుకుంటారన్న నమ్మకంతో కలిశెట్టికి టికెట్ ఇచ్చినప్పటికీ …అదే కాపులకు పెద్దగా వ్యవహరిస్తున్న కళా వెంకట్రావుతో కూడా ఆయన విభేదాలు ఉన్నాయంటున్నారు .. అయితే కళా పోటీ చేస్తున్న చీపురుపల్లి విజయనగరం ఎంపీ సీటు పరిధిలోదే అవ్వడంతో .. వారిద్దరు కలిసి పనిచేయక తప్పని పరిస్థితి… మరోవైపు కలిశెట్టిది శ్రీకాకుళం జిల్లా అవ్వడంతో ఇక్కడి కాపు నేతలు ఎంతవరకు ఆదరిస్తారనేది ప్రస్తుతానికి క్వశ్చన్ మార్క్ గానే ఉంది . …
అటు బెల్లానపై కూడా ప్రజలకు అంత సాఫ్ట్ కార్నర్ లేదన్నది కాదనలేని సత్యం … ఎంపి అయినా చేసింది సున్నా కాబట్టి మరోసారి ప్రజలు ఆదరిస్తారా అన్న అనుమానాలు వైసీపీ శ్రేణుల్లోనే వ్యక్తమవుతున్నాయి… . ఆ క్రమంలో ఇద్దరిలో ఎవరిని ఎంచుకోవాలో అన్న కన్ఫ్యూజన్ కూడా ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోంది… ఒకరు నాన్ లోకల్ మరొకరు లోకల్ అయినా నో ప్రోగ్రెస్ .. మరి చూడాలి ఈ సారి విజయనగరంలో ఎవరి లక్ ఎటా ఉంటుందో?
Discussion about this post