నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో ‘ రేవంత్ దండుగా ..ప్రజాపాలనకు అండగా’ కార్యక్రమం జరిగింది. దీనిలో భాగంగా ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ సింగోటం శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కొల్లాపూర్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీ నాగర్ కర్నూల్ కు వచ్చే అర్హత లేదన్నారు. పాలమూరు జిల్లాకు ప్రధాని ఏం చేశారని నాగర్ కర్నూల్ సభకు వస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ ప్రజలు ఈనెల 18న శుభవార్త వింటారని అన్నారు. అధిష్టాన నిర్ణయమే శిరోధార్యమని సీఎం రేవంత్ రెడ్డి పై నమ్మకం ఉందన్నారు. బీజేపీకి అభ్యర్థులు దొరకక పక్క పార్టీల నుంచి అరువుగా తెచ్చుకొని పోటీలో నిలబెడుతోందని విమర్శించారు.
Discussion about this post